భక్తులకు విజ్ఞప్తి.. గణపతి పూజలో తెల్లటిపూలు, తులసిని అస్సలు వాడకండి..!

-

చిన్నపెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ చేసుకునే పండగే గణేష్‌ చతుర్థి. వీధిలో గణపతి విగ్రహం పెడితే.. హడావిడి మాములుగా ఉండదు. అంతా మనదే అన్నట్లు నడిపిస్తాం. ఈరోజున విఘ్నాలను దూరం చేసే అధిదేవుడు వినాయకుడి జన్మదినంగా భావిస్తారు. గణేషుడి విగ్రహం పెట్టి పూజలు చేస్తారు.. కానీ కొంతమంది తెలిసీ తెలియక చేసే పొరపాట్ల వల్ల పుణ్యం కంటే పాపాన్ని మూటకట్టుకుంటారు. వినాయకచవితి అనగానే మనకు ముందుగా గుర్తుచ్చేది..పత్రికలు. కొంతమంది తెలియక గణేషుడికి సమర్పించకూడనివి పూజలో చేస్తుంటారు. ఈరోజు మనం ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.

బొజ్జ గణపయ్యకు ప్రత్యేకంగా కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా ఎర్రటి పూలను సమర్పిస్తారు. వినాయకుడికి గరికను కూడా సమర్పిస్తారు. వీటిని 11, 21 లేదా 51గా గరికను ఆది గణేషుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత గుంజీలు తీసి తమ మనసులోని కోరికను తీర్చాల్సిందిగా భక్తితో వేడుకుంటారు.

అయితే.. గణేషుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసీని పెట్టకూడదు. తులసీని విష్ణూమూర్తికి అర్పించాలి. శివునికి బిల్వపత్రంను అర్పించాలి. అమ్మవారికి ఎర్రటి పూలు సమర్పించాలి. వినాయకుడికి గరికను సమర్పించాలి. మీరు గణేషుడికి తులసిని ఎట్టిపరిస్థితుల్లో సమర్పించకూడదు. ఇది మాహా పాపం.

గణపతిని పూజించేటప్పుడు తులసి ఆకులను సమర్పించడం నిషిద్ధం. దీని వెనుక అనేక అపోహలు ఉన్నాయి. ఇందులో, మతపరమైన గ్రంథాలను విశ్వసిస్తే, గణేశుడు ఒకసారి తులసిని వివాహ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆ తర్వాత తులసి గణేశుడిని రెండుసార్లు పెళ్లి చేసుకోమని శపించింది. వినాయకుని పూజలో తులసిని సమర్పించడం నిషిద్ధంగా పరిగణించబడటానికి ఎటువంటి కారణం లేదు. వినాయకుడిని పూజించేటప్పుడు అన్ని రకాలు పూల పనికిరావు. తెల్లటి పూలు, తెల్లని వస్త్రాలు, తెల్లటి పవిత్ర దారం, తెల్ల చందనం మొదలైన వాటిని సమర్పించకూడదు. కేవలం ఎర్రటి పూలు సమర్పించాలి.

కాబట్టి తెలిసి తెలియక పొరపాట్లు చేయకండి. పుణ్యఫలం పొందండి. మీకు మీ కుటుంబసభ్యులకు మనలోకం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news