ఆఫీస్ లిఫ్ట్‌లో మూడు గంటల పాటు ఇరుక్కుపోయిన ఉద్యోగి.. లేట్‌గా వచ్చాడని శాలరీ కట్‌

-

ఉద్యోగం చేయాలంటే… కేవలం మనకు ఆ జాబ్‌ కావాల్సిన అర్హత ఉంటే సరిపోదు. చాలా నియమాలు పాటించాలి. రూల్స్‌ ఫాలో అవ్వకపోతే నువ్వెంత టాలెంట్‌ అయినా.. పక్కకు దొబ్బే అంటారు. ముఖ్యంగా ఆఫీస్‌కు లేట్‌గా వస్తే ఆరోజు శాలరీ కట్‌ చేస్తారు. సెలవు తీసుకున్నట్లే.. కానీ పని చేయాలి. ఇప్పుడు జరిగిన ఒక ఘటన చెప్తే.. మీరంతా షాక్‌ అవుతారు. ఒక ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చాడు. కానీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. దాదాపు 3 గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉన్నాడు. సాధారణంగా ఇలా జరిగితే.. ఎవరైనా..అతని మీద జాలి పడతారు. అయ్యో ఎలా ఉన్నాడా అని అనుకుంటారు. కానీ ఆ బాస్‌ మాత్రం ఆ రోజు శాలరీ కట్‌ చేశాడు.

కార్పోరేట్ కంపెనీలే కాదు చిన్న కంపెనీల్లో కూడా ఉద్యోగులకు పనివేళలు నిర్ణయించారు. ఉదయం లాగిన్ అవ్వడం ఆలస్యం అయితే జీతం కట్ అవుతుంది. అయితే ఆఫీస్ లిఫ్ట్‌లో లోపం వచ్చినప్పుడు, ఆఫీస్‌కు వచ్చాడని తెలిసి కూడా ఉద్యోగి జీతం ఎలా కట్ చేస్తారు? ఇది కూడా ఓ బ్యాంకు ఉద్యోగి అనుభవమే. బ్యాంకు ఉద్యోగి విధులకు గైర్హాజరు కావడంతోపాటు ఒక్కరోజు జీతంలో కోత విధించారు.

ఆ ఉద్యోగి ఈ స్టోరి అంతా రెడ్డిట్‌లో పోస్ట్‌ చేశాడు. నిన్న నేను ఆఫీసుకి బయలుదేరాను. ఆఫీసు లిఫ్ట్ ఎక్కాను. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. కరెంటు లేదు. నేను నిర్వహణ విభాగానికి నా కార్యాలయానికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ సంబంధం లేదు. చాలా ప్రయత్నాల తర్వాత, కాల్ HRకి వెళ్ళింది. నేను లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని వారికి చెప్పాను. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని లిఫ్ట్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. వరుసగా మూడు గంటల తర్వాత నన్ను లిఫ్ట్‌లోంచి బయటకు తీశారు.

నేను లిఫ్ట్ లోంచి బయటకి రాగానే కోలుకోకముందే నువ్వు లేట్ అవ్వడం వల్ల జీతం కూడా కట్ చేస్తా అన్నారట. ఇది నన్ను మరింత కలతపెట్టింది. నేను సెలవు తీసుకుని ఇంటికి వెళతానని AMకి చెప్పాను. కానీ AM, సిబ్బంది కొరత ఉన్నందున మీరు పని చేయాల్సిందే అన్నారట. డ్యూటీ అవర్స్ ఫిక్స్ అయితే పని చేస్తానని AMకి చెప్పాను. కానీ అతను నాపై ఆరోపణలు చేయడం ప్రారంభించాడు. నాతో ఏమి తప్పు అని నేను అడిగినప్పుడు, ఉద్యోగి వారు ఎలివేటర్ కెమెరా రికార్డ్, హెచ్‌ఆర్‌తో నా అనుభవాన్ని రికార్డ్ చేశారని రాశారు. అతని పోస్ట్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా మంది ఆ జాబ్‌ మానేయమని కమెంట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news