చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం!

-

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్ స్కాం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ కనిపించడం లేదంటూ అతని భార్య పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. రెండు రోజులుగా తన భర్త ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే కలుస్తలేదని నరేష్ భార్య సరోజిని పడమట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

సెప్టెంబర్ 26న నరేష్ హైదరాబాద్ వెళ్లాడని, 28న తనకు కాల్ చేసి తనకు రావల్సిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంక్ స్కాం కేసులో అటు బెజవాడ పోలీసులు గాలిస్తుండగా.. హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు వెతుకుతున్నారు. ఇదిలాఉండగా, కస్టమర్లకు చెందిన రూ.28కోట్ల డిపాజిట్లను 72 ఖాతాల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ బృందం దారి మళ్లించాయి. ఆ డబ్బులను నెక్సస్ గ్రోత్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు.ప్రస్తుతం ఆ సంస్థ ఓనర్ ప్రభు కిషోర్ పరారీలో ఉండగా.. నరేష్ సైతం కనిపించకుండా పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news