అనగాని హాట్ కామెంట్ : రద్దు చేయాల్సిందే..!

-

దేశంలో కరోనా విజృంబిస్తున్న క్రమంలో అనేక రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేశాయి. విద్యార్థులను పై క్లాసులకు నేరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలు దీన్ని ప్రకటించాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పదో తరగతి పరీక్షలు పెట్టి తీరుతామని ప్రభుత్వం చెప్తుంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సరిగా క్యాబినెట్ సమావేశమే నిర్వహించడం చేతకాని ఈ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహించగలదని వ్యంగ్యంగా మాట్లాడారు.

అసలు పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని, లాక్ డౌన్ పరిస్థితుల్లో పది పరీక్షల అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పేరుగుతుంటే, పరీక్షల పేరిట విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ మండిపడ్డారు. కరోనా వైరస్ భయంతో సీఎం జగన్ తాడేపల్లి రాజభవనం నుంచి బయటికి రావడంలేదని, మంత్రులు నియోజకవర్గం దాటట్లేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఎలా బయటికి వస్తారని అనగాని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల మాదిరి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news