కరోనా మహమ్మారి విజృంభన సమయంలో మారుమోగిన పేరు ఆనందయ్య. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆనందయ్య తాను కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టానంటూ ప్రకటించారు. దాంతో ప్రజలు కూడా ఆనందయ్య మందుకు జై కొట్టారు. అలా తరచూ వార్తల్లో నిలిచిన ఆనందయ్య ఏకంగా రాజకీయాల్లోకి దిగుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పార్టి స్థాపన పై క్లారిటీ కూడా ఇచ్చారు. త్వరలోనే బీసీలకోసం రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్టు ఆనందయ్య ప్రకటించారు.
నిన్న విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ….కరోనా మూడు దశలను ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉందని ఆనందయ్య వెల్లడించారు. ప్రభుత్వం సహకరిస్తే ఆ మందును పంచుతానని చెప్పాడు. అంతే కాకుండా ప్రభుత్వం బీసీలను విస్మరిస్తోందని కామెంట్లు చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తానని…బీసీ జేఏసీని కలుపుని పనిచేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు.