అన్నీ ఉన్నా అనన్య నాగళ్ళ కు ఛాన్స్లు రావడం లేదు.!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు చిక్కుతాయి. గతంలో తెలుగు హీరోయిన్ అంటే తెలుగు లో కచ్చితంగా మాట్లాడే వారికి మాత్రమే అవకాశం ఇచ్చే వారు. ఇంకా పాత రోజులకు పొతే పాటలు కూడా తెలుగు లో పాడే వారు మాత్రమే ఉండేవారు. కాని ఆ తర్వాత కాలంలో  సినిమాల లో వచ్చే తెలుగు హీరోయిన్ ను ఎతుక్కోవలసి వస్తోంది.

కొంత మంది అమ్మాయిలు తెలుగులో హీరోయిన్స్ గా ఉన్నా సరైన అవకాశాలు రావట్లేదు. అలాంటి వారిలోఅనన్య నాగళ్ళ కూడా ఉంది. తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి లతో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.తెలుగమ్మాయి కావడంతో అంత త్వరగా అవకాశాలు మాత్రం రావడం లేదు.  పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో అనన్య నటనకు మంచి పేరు వచ్చింది. కాని విచిత్రంగా మళ్లీ పెద్ద అవకాశాలు రావడం లేదు.

వకీల్ సాబ్ సినిమా మంచి పేరు తేసుకొచ్చినా గాని పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదు. సినిమాల్లో  తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. . ఇంత గ్లామరస్ గా , అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అవకాశాలు రావటం లేదని ఆమె ఫాలోయర్స్  తెగ బాధపడి పోతున్నారు.ఈ హాట్ హాట్ ఫోటోలు చూసి అన్నా ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news