మరో షాకింగ్ పాత్రలో నటిస్తున్న అనసూయ..!!

-

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎవర్ గ్రీన్ మీడియా కంటెంట్. యాంకర్స్ కు గ్లామర్ పాఠాలు నేర్పింది కూడా ఆమెనే.తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు.జబర్దస్త్ కు మొదట అనసూయ యాంకర్ గా చేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి తనకి లైఫ్ ఇచ్చిన షోగా జబర్థస్త్ ను చెప్పుకోవచ్చు. ఆ షో వల్లే తనకి మిగిలిన షోస్ మరియు సినిమా అవకాశాలు వచ్చాయి. ఆమె చేసిన రంగస్థలం, పుష్ప సినిమాల లో  పాత్రలకు మంచి పేరు వచ్చింది. అప్పుడే ఆమె సినిమాలకు షిప్ట్ అయ్యింది. ఇప్పుడు మాత్రం షాప్స్ ఓపెనింగ్స్ చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న మైఖేల్ సినిమాలో అనసూయ కీలక పాత్రలో  నటిస్తూ ఉంది.ఈరోజు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంటే సినిమా లో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ ఇచ్చినట్లు గా కనపడుతోంది. ఆమెను మాడ్ క్వీన్ గా సంబోధిస్తూ పోస్టర్ విడుదల చేశారు. అంతకు ముందు విడుదల చేసిన హీరో సందీప్ కిషన్ పోస్టర్ కూడా సూపర్ గా ఆకట్టుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news