జైళ్లో జబర్ధస్త్ యాంకర్ అనసూయ… అస‌లేం జ‌రిగింది!

-

బుల్లితెర హట్ యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఆమె పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఓ వైపు యాంకర్ గా గ్లామర్ షో చేస్తూనే .. మరోవైపు వెండి తెర మీద విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాంక‌ర్‌గానే కాకుండా .. సినిమాలతో కూడా అంతే బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడూ పోలీసుల అదుపులో జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల‌వుతుంది.

anasuya

వివ‌రాల్లోకెళ్తే.. గత కొన్నేళ్లుగా అనసూయ.. ఓ వైపు జబర్ధస్త్ కామెడీ షోలతో పాటు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.. తాజాగా అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే.. ఈ సినిమాలో అనసూయ ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్న‌ది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అన‌సూయ‌పై జైళ్లో కొన్ని సీన్లు షూట్ చేశారు. ఈ చిత్రంలో అనసూయ జైల్ సీన్స్ కీలకమ‌ని తెలుస్తుంది.

అన‌సూయ గ్లామ‌ర్ షో చేయ‌డ‌మే కాకుండా .. న‌ట‌న‌కు ప్రాధాన్యత ఉండే పాత్రలకు ఎంచుకుంటూ త‌న కెరీర్లో జెట్ స్పీడ్ తో ముందుకెళ్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమా లో రంగమ్మత్తగా న‌టించి మెప్పించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమా న‌టించేందుకు ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలోనూ.. ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈమె ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. అలాగే..ఎప్పటి కపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news