Breaking : బిగ్‌బాస్ 6లో ఉదయ భాను.. భారీ ఆఫర్‌

-

బిగ్‌ బాస్‌ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి సంవత్సరం ఎప్పుడెప్పుడు ఈ బిగ్‌ బాస్‌ షో ప్రారంభవుతుందా అని ఎదురు చూస్తుంటున్నారు. అయితే బిగ్‌ బాస్‌ 6 తెలుగు షో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షోను హోస్ట్‌ చేస్తున్న నాగార్జున ప్రోమో షూటింగ్‌ కూడా జరిగింది. అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయం ఒకటి తెలుస్తోంది. ఒకప్పుడు ఉదయభాను స్టార్ యాంకర్ గా రాణించిన విషయం తెలిసిందే. తన మాటలతో, చలాకీ తనంతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు ఉదయభాను. ఆ తర్వాత ఆమె యాంకరింగ్ కు దూరం అయ్యారు.

Is Anchor Udayabhanu Gets Offer In Bigg Boss 6 Telugu Season, Check  Remuneration Details - Sakshi

ఇటీవల అడపాదడపా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేశారు ఉదయభాను. అయితే బిగ్ బాస్ సీజన్ 6 కు ఈ అమ్మడిని సంపాదించారని తాజా వార్త. ఇందుకోసం ఉదయభానుకు భారీ రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. అయితే ఉదయభాను మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. అయినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారట. చూడాలి మరీ బిగ్‌ బాస్‌లో ఉదయ భాను సందడి చేస్తుంది అని..

 

Read more RELATED
Recommended to you

Latest news