కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రతీ రాష్ట్రంలో కఠినంగా అమలు అయ్యేలా వ్యవహరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా కఠినతరంగా వ్యవహరించాలని కేంద్రం గట్టిగా ఆదేశాలు ఇవ్వడం మనకందరికీ తెలిసినదే. తాజాగా మళ్లీ 19 రోజులు మోడీ పొడిగించడం తో ప్రజలలో కొంత నిరుత్సాహం ఏర్పడింది. ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోవడం తో పాటు అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు క్లోజ్ అయిపోయాయి. అన్ని రంగాలు మూతపడటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇంటికి సరుకులు తీసుకోవాలన్న, అత్యవసర సమయంలో బయటకు రావాలని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రిస్క్ చేసి అనవసరంగా రోడ్లపైకి వాహనాలు వచ్చి పోలీసుల చేత లాఠీ దెబ్బలు తింటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు వాహనాలను సీజ్ చేసి భారీగా ఫైన్ వేస్తున్నారు. మాస్క్ లు లేకపోయినా గాని చాలా దారుణంగా కొడుతున్నారు.అయితే ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా తాజాగా ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ముందుగా సరుకు రవాణా కి, అత్యవసర సేవలు కావలసినవారికి, కరోనా వైరస్ బాధితులకు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేసే వాళ్ళకి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీస్ స్టేషన్ వారి చేత స్పెషల్ పాసులు ఇప్పించే కార్యక్రమం స్టార్ట్ చేసింది. వైద్యం చేయడం కోసం స్వచ్ఛంద సేవ చేసేవాళ్లు, ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్లు ఇతరత్రా సమస్యలతో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారికి కరోనా ఎమర్జెన్సీ పాసులను జారీ చేసేందుకు సిద్ధమైంది. నేరుగా కాకుండా వాట్సాప్ ద్వారా గాని లేకపోతే ఈమెయిల్ ఐడి ద్వారా గాని వెహికల్ పాసులను మంజూరు చేయడానికి ఏపీ పోలీస్ శాఖ రెడీ అయింది.
అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి మూడు మాస్క్ లు ప్రభుత్వమే ఇవ్వటానికి రెడీ అయింది. స్కూల్ పిల్లలకు వీలైతే స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ పాఠాలు తెలియజేయ వచ్చునని పర్మిషన్ ఇచ్చింది. దీంతో చాలా వరకు ఒక పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేస్తూనే, మరోపక్క ప్రజల అవసరాలను గుర్తించి ఏపీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. దీంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఈ మూడు సూత్రాలపై దేశవ్యాప్తంగా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇవే మూడు సూత్రాలు దేశవ్యాప్తంగా పాటిస్తే మంచి రిజల్ట్ వస్తుందని చాలామంది అంటున్నారు. అత్యవసర అవసరాలు తీరతాయి, మరోపక్క రవాణాకి ఎటువంటి అడ్డంకి ఉండదు, పోలీస్ పర్మిషన్ తోనే స్పెషల్ పాస్ లు ఇవ్వటం వల్ల ఎటువంటి గొడవలు జరగవని చాలామంది ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్ధిస్తున్నారు.