జనాలను మరీ ఇంత మోసం చేస్తున్నారా…?

-

మద్యం కోసం ప్రజలు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేదు. డబ్బు ఉంది డబ్బు లేదు అనే తేడా లేదు… మద్యం రోజుకి ఒక పెగ్ అయినా తాగాలి అని భావించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మద్యం దొరకక నానా అవస్థలు పడే పరిస్థితి నెలకొంది. దీనిని కొందరు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు మద్యం షాపు యజమానులు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని సమాచారం.

గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను చేపడుతున్నారు. ఇందుకోసం తక్కువ రేటు క్వార్టర్ ని వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు. జనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు విక్రయాలు చేపడుతున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఎంత వరకు మంచి విధానం కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నాయని,

తమ బిడ్డలకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నామని కన్న తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగాళ్ళు ఇప్పుడు ఉన్న నాలుగు రూపాయలను ఇలా ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోజు రోజుకి పరిస్థితులు దిగజారుతున్నాయి. వ్యవసాయ పనులు కూడా అయిపోయాయి. రెండు నెలలు ఆగాలి పనులు ఉండాలి అంటే.. ఇలా ప్రజలను మద్యం షాపు యజమానులు మోసం చేస్తున్నారని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news