ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 68 మరణాలు సంభవించాయి. అలాగే నేడు 10,040 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,37,687కి చేరింది. ఇందులో 97,338 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా.. 4,35,647 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 4,702కి చేరింది. అలాగే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 43,80,991 టెస్టులు జరిగాయి.
#COVIDUpdates: 10/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,34,792 పాజిటివ్ కేసు లకు గాను
*4,32,752 మంది డిశ్చార్జ్ కాగా
*4,702 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,338#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Rk3s1FsCUE— ArogyaAndhra (@ArogyaAndhra) September 10, 2020