వెన్నుపోటు దారుడు చంద్రబాబును పాతాళంలో పాతేయాలి : కొడాలి నాని

-

వెన్నుపోటు దారుడు చంద్రబాబును పాతాళంలో పాతేయాలి అని కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు కొడాలి నాని.  మనందరి నమ్మకం సీఎం జగన్.. సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది అన్నారు.  వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు. మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు చంద్రబాబుది మాయా కూటమి అని పేర్కొన్నారు.

సీఎం జగన్ ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడు. దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్ ను కాపాడాయి అని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ ను వెంట్రుక కూడా పీకలేరన్నారు. వెన్నుపోటు పొడవడంలో ఈ దేశంలో చంద్రబాబుకు మించిన వాడు మరెవ్వడు లేరన్నారు. జగనన్నా మీరు మళ్లీ సీఎం అవుతారు. చంద్రబాబు కాదు కదా.. ఆయన బాబు వచ్చినా కూడా మీ వెంట్రుక కూడా పీకలేరు. మీ దమ్ము, ధైర్యం, నిబద్ధత మేము దగ్గరి నుంచి చూశాం. చెప్పిన మాటపై తూచ తప్పకుండా నిలబడే తత్వం మీది. గడిచిన ఐదేళ్లలో మీతో ఒక చిన్న అబద్దం కూడా చెప్పించలేకపోయామని కొడాలి నాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news