తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు : సీఎం జగన్

-

పేదల భవిష్యత్, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ..  కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు అన్నారు. అందుకు  కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే.. అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు అన్నారు.


జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు.  ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు.   మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు. నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం.

Read more RELATED
Recommended to you

Latest news