ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువత భవిష్యత్ ను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. తాము పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు అందజేయడంతో పాటు పంటలకు గిట్టు బాటు ధర కల్పిస్తామని రాయదుర్గం సభలో చంద్రబాబు చెప్పారు.
మీ రక్తాన్ని తాగేస్తున్నాడు ఈ జలగ జగన్. ఒక లక్ష రూపాయలు మీ దగ్గర దోచుకుంటే.. దానికి ఒక లీటర్ బ్లడ్ గా లెక్క వేసుకోండి. ఈ ఐదేళ్లలో మీ దగ్గర ఎంత దోపిడి చేశాడో..? ఎన్ని లీటర్ల రక్తాన్ని మీ దగ్గర తాగాడో మీరు లెక్క వేయండి. మీ పేరుతో రూ.13లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు జగన్. ఆ అప్పు జగన్ మోహన్ రెడ్డి కడతాడా..? పన్నుల ద్వారా..ప్రజలే కట్టాలి. ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.