తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీ కి కేటాయించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలి జాబితాలోనే ప్రకటించింది. అకస్మాత్తుగా ఆ స్థానానికి మళ్లీ బీజేపీని ప్రకటించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ.. నల్లమిల్లికి టికెట్ ప్రకటించినట్టే ప్రకటించి.. మళ్లీ వెనక్కీ తీసుకోవడం.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా నిన్న బీజేపీకి కేటాయించడం దారుణమన్నారు నల్లమిల్లి అనుచరులు.
రామవరంలో సైకిల్ తో పాటు టీడీపీ ప్లెక్సీలు, జెండాలు తగులబెట్టి నిరసన తెలిపారు నల్లమిల్లి అనుచరులు. నల్లమిల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. తాజాగా కార్యకర్తలతో సమావేశం అయ్యారు నల్లమిల్లి. కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి తిరిగి నాలుగు రోజుల వరకు ఇంటింటికి తిరిగి తన నిర్ణయం ఏంటోనని చెబుతానని పేర్కొన్నాడు రామకృష్ణారెడ్డి. టీడీపీ ఏవిధమైన ప్రపోజల్స్ పెట్టినా.. ప్రజల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని తెలిపారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.