డ్రగ్స్ ఎవరు తెచ్చారు..? : పేర్ని నాని

-

డ్రగ్స్ ఎవరు తెచ్చారు. మీ చుట్టాలు తెప్పించిన డ్రగ్స్ ని మాకు అంటగడితే ఎలా..? ఓటర్లకు డ్రగ్స్ పంచడానికే చంద్రబాబు, లోకేష్ తెప్పించారా..? అని ప్రశ్నించారు. వైసీపీ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ అకౌంట్ లో ఏ రకంగా విషం చిమ్మాడో కేంద్ర ఎన్నికల కమిషనర్ కి విన్నవించామని తెలిపారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లందరూ టీడీపీ నేతల బంధువులే అన్నారు. 

 

ఎన్నికల నియమావళి అనుసరించి తప్పుడు తనం అన్నారు. ఎక్కడ కూడా నిందలు వేయడం కానీ.. ఆధారాలు లేకుండా రాజకీయ వ్యతిరేకుల మీద తప్పుడు ప్రకటనలు చేయకూడదు. చేస్తే.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉంది కాబట్టి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ని కోరాం అని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేవిధంగా టీడీపీ వ్యవహరిస్తోందని పేర్నినాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news