కరోనా వైరస్ అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టంగా ఉందని మొన్నటివరకు జాతీయ మీడియా మరియు దేశంలో ఉన్న చాలామంది నాయకులు అభినందించారు. అటువంటిది ఒక్కసారిగా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావటంతో ఏపీలో ఒక్కసారిగా రెండు రోజుల్లో పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలో కి వెళ్ళిపోయింది. ప్రారంభంలో విదేశాల నుండి వచ్చిన వారి నుండి మాత్రమే ఇతరులకు ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో వారిని ఏపీ ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. అయితే ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాల సేకరించే విషయంలో ఏపీ ప్రభుత్వం చాలావరకు విఫలమయింది.ప్రస్తుతం రెండు రోజుల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అన్ని కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివి కావటంతో ఏపీలో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వీళ్ళందరూ ఎవరికీ ఈ వైరస్ ని అంటించారో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విశాఖపట్టణం నుండి ఢిల్లీ మత ప్రార్థనలకు అధికారుల విచారణలో వందల్లోనే వెళ్ళారన్నది ప్రాధమిక సమాచారం. కాగా వీళ్లంతా పదిహేను రోజులుగా ఎక్కడ ఉన్నారు. ఎవరితో కాంటాక్ట్ అయ్యారన్నది కూడా ఇపుడు వెలికితీయడం ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ గా ఉంది.
ఇదే సమయంలో విదేశాలనుండి విశాఖకు వచ్చిన వారిలో 250 మంది ఆచూకీ వివరాలు ఇంకా దొరకలేదని తప్పుడు అడ్రస్ లు ఇవ్వటం జరిగిందని వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో విశాఖ నగర వాసుల లో ఆందోళనలు నెలకొన్నాయి. లాక్ డౌన్ సమయంలో నిత్య అవసరాల కోసం తిరిగే వారికి కూడా టెన్షన్ పట్టుకుంది. ఒక్క విశాఖపట్నం మాత్రమే కాదు విదేశీయులు అడ్రస్ తెలియకపోవటం సంఘటన ఏపీ మొత్తాన్ని భయపెడుతోంది.