త్వరలో ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ అమలు మీద ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో సర్కార్ అక్కడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. పదకొండవ పీఆర్సీ చైర్మన్ మిశ్రా నివేదిక మీద అధ్యయనానికి కమిటీని నియమించింది. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పని చేయనుంది.
సభ్యులుగా ఏపీ సీఎం ముఖ్య సలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జేఏడీ శాఖల అధికారులు ఉండనున్నారు. ఆర్టీసీ విలీనంతో ఏర్పాటయిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విభాగంలోని ఉద్యోగులకు పీఆర్సీ కేటాయించే అంశం మీద కమిటీ చర్చించనుంది. వీలయినంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం మీద కూడా ఈ ప్రెజర్ పడింది. దీంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.