తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ఉన్న మెడికల్ షాపులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ షాప్ లో నో మాస్క్-నో మెడిసిన్ పద్ధతి ఫాలో కావాలని ఆదేశించింది.
దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు ఏవి కనిపించినా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దని ఆదేసిన్దింది. అలాగే ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ప్రభుత్వాసుపత్రికి వెళ్ళమని సూచించాలని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.