ఏపీలో నాలుగు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోద ముద్ర..

నలుగురు ఎమ్మెల్సీ లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేసారు. గవర్నర్ కోటాలో లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు ఎంపిక అయ్యారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే గవర్నర్ నిర్ణయాన్ని… టిడిపి తీవ్రంగా వ్యతిరేకించింది. తోట త్రిమూర్తులు, అప్పిరెడ్డి, రమేష్ యాదవ్ కు నేర చరిత్ర ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య గవర్నర్ కు లేఖ రాశారు. టిడిపి లేఖ రాసిన నేపథ్యంలోనూ.. ఏపీ గవర్నరు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో…నలుగురు ఎమ్మెల్సీ పదవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యాయి.

కాగా ఏపీ గవర్నర్  తాజా నిర్ణయంతో ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మోషన్ రాజు ఎమ్మెల్సీ పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. ఏపీ గవర్నర్  విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయంకి ఎలాంటి అడ్డు లేకుండా పోయింది. అటు గవర్నర్ నిర్ణయం తో టిడిపి డలాపడింది.