నత్తల ఫేషియల్‌… కాస్మొటిక్‌ రంగంలోనే అద్భుతం!

-

జపాన్‌ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే నత్తలతో ఫేషియల్‌. అదేంటి ప్రత్యేకంగా నత్తలతో ఫేషియల్‌ చేసుకోవడమేంటని అందులో ఏం ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇది కేవలం జపాన్‌లో మాత్రమే కాదు. స్వీడన్, జోర్డాన్‌ వంటి చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి. సాధారణంగా నత్త ఆకారం చూస్తేనే భయం కలుగుతుంది. కానీ ఆ నత్తలు మనుషులకు చేసే మేలేంటో తెలిస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. నత్తలు మోహం మీద అటూ ఇటూ పాకితే ముఖంపై ఉండే ముడతలు, గాయాలు, మొటిమలు ఇట్టే మాయమవుతాయట. అంతేకాదు దీనివల్ల మొహం కూడా కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.


సాధారణంగా నత్తకు.. అంటే వాటి చిప్పకు ఏదైనా గాయమైనా, ఆరోత్య సమస్యలు వస్తే వాటంతట అవే నయం చేసుకునే గుణం ఉంది. ఇలా అవి ఏవిధంగా నయం చేసుకుంటాయనే పరిశోధనలో నత్తలు జిగట పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయని తెలిసింది. ఈ పదార్థం వల్లే శరీరానికి ఏ సమస్యలు వచ్చినా నయం చేసుకోగలుగుతాయి. దీంతో ఇప్పటికే ఆ జిగురు సాయంతో సబ్బులు కూడా తయారు చేస్తున్నారు.

నత్తలు స్రవించే జిగటలో కొల్లాజెన్, ఎలాస్టిన్‌ ఉంటాయి. వీటికి గాయాలు నయం చేసే గుణం ఉంటుందని పరిశోధకులు చెప్పారు. దీంతో ఇప్పటి వరకు నత్తలపై జరగని ప్రపంచవ్యాప్త పరిశోధనలు, ఇప్పుడు మొదలయ్యాయి. జపాన్‌ వాసులు సాధారణంగానే ఎప్పుడూ యవ్వనంగా ఉండటానికి ఇష్టపడతారు. కేవలం జపాన్‌ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత కాస్మొటిక్‌ కంపెనీలు ఈ నత్తల జిగురుపై దృష్టి పెట్టింది. ఈ జిగురులోని కొల్లాజెన్‌ వల్ల యవ్వనంగా ఉండే తత్వం ఉంటుంది. అందుకే మరిన్ని కాస్మొటిక్‌ ఉత్పత్తులను తయారు చేయటానికి సన్నధమవుతున్నాయి. ఇంకా రాబోయే కాలంలో నత్తలకు సంబంధించిన కాస్మొటిక్‌ అందుబాటులోకి రానున్నయన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news