ఏపీ లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది అప్లై చేసుకున్నారు.ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకపోగా ,75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారు. మాల్ ప్రాక్టీస్కు పాల్గొన్న వారిపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.
ఇప్పటికే ఇంటర్ సమాధాన పత్రాల కరెక్షన్ కూడా మొదలైంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఈ పేపర్ మూల్యాంకనం పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తయిన వెంటనే ఏప్రిల్ 2 వారంలో ఫలితాలు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఇంటర్ పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,000 కెమెరాలను ఉపయోగించి పరీక్షలను నిర్వహించారు. పరీక్ష పత్రాలు ఎక్కడ కూడా లీక్ కాకుండా ఉండేటట్లు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.