రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది – కొల్లు రవీంద్ర

-

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా దగా చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, టిడిపి నేత కొల్లు రవీంద్ర. రైతుల భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతులకు 15 వేలు ఇస్తామన్నారని.. ఎన్నికల తరువాత 7500 ఇస్తు, కేంద్రం ఇస్తున్న 6 వేలు కలుపుకొని 13500 ఇస్తున్నామని డబ్బా కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

police arrested ex minister kollu ravindra

రైతు భరోసా పేరుతో జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. రైతులకు వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసం, మాయ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల ఆత్మ హత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ ౩ వ స్థానంలో వుందన్నారు కొల్లు రవీంద్ర. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు ౩ వేలమంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, ఎంత మందికి ఇచ్చాడని నిలదీశారు.

ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల లో లేనిపోని షరతులు పెట్టి రైతులను రోడ్డు న పడేసాడన్నారు. ఏ పంటకు మద్దతు ధర లభించలేదని.. ధాన్యం సేకరణకు 37 లక్షల టన్నులకు కుదించారన్నారు. జగన్ మరిన్ని అప్పుల కోసం మోటార్లకు, మీటర్లు పెట్టి రైతు మెడకు వురి బిగిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news