విభజన కేసులో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామని తెలిపారు మాజీ ఎంపీ ఉండవల్లి. ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుందని… ప్రభుత్వం దాఖలు చేసిన అభివృద్ధి కారణంగా ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందని వివరించారు.
ప్రత్యేక హోదా, పోలవరం సహా కేంద్ర నుంచి ఏపీకి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో వివరించారన్నారు ఉండవల్లి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారని.. గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున ఇదే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగానన్నారు. చేస్తానని చెప్పారు… కానీ చేయలేదు..అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.