ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు కాన్సెప్ట్ సిటీలు అభివృద్ధి చేస్తామని.. అనంతపురం, విశాఖ, తిరుపతిలో ఐటీ సిటీల నిర్మాణం చేస్తామని ప్రకటించారు మంత్రి అమర్నాథ్. మూడు లక్షల ఎస్.ఎఫ్.టి.తో ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేయబోతు న్నామని… భోగాపురం దగ్గర ఐటీ కాన్సెప్ట్ సిటీ రానుందని వివరించారు మంత్రి అమర్నాథ్.
2023-2028 కోసం ఇండస్ట్రియల్ పాలసీని అమల్లోకి తీసుకుని వస్తామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్టంలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్న వనరులను షోకేస్ చేస్తామని.. 3వ తేదీన సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను సీఎం ప్రారంభిస్తారని.. 4వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో కీలక ఒప్పందాలు జరుగనున్నాయని వివరించారు.
యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వస్తున్నారని… 2023-2028 కోసం ఇండస్ట్రియల్ పాలసీ ని అమల్లోకి తీసుకుని వస్తామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిశీలనలో పాలసీ ఉందని.. ఎర్లీ బర్ద్ కింద GISలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని చెప్పారు.