మరో రూ.1,000 కోట్లు అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం !

-

ఏపీలోని జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో రూ. వెయ్యి కోట్లు అప్పు తీసుకుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్లుగా సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది.

ఈ క్రమంలో ఆరు సంవత్సరాల కాల పరిమితితో వేలం వేసిన సెక్యూరిటీ బాండ్లకు 7.6% మేర ప్రభుత్వం వడ్డీ చెల్లించనుంది. 2028 నాటికి సెక్యూరిటీ బాండ్లు పూర్తిగా చెల్లించేలా కాలపరిమితే నిర్దేశించారు. ఇక, 12 సంవత్సరాల కాల పరిమితితో వేలం వేసిన మరో రూ. 500 కోట్ల సెక్యూరిటీ బాండ్లకు ప్రభుత్వం 7.71 శాతం మేర వడ్డీ చెల్లించనుంది. దీంతో 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 45,890 కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news