ఏపీలో 4.07 కోట్ల మంది ఓట్లర్లు.. 22న తుది జాబితా విడుదల : సీఈసీ రాజీవ్ కుమార్

-

ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఇవాళ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళణ వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సందర్శించాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కొందరూ ఓట్లను నమోదు చేసుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. రాష్ట్రంలో మొత్తం రూ.4.07 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు1.99 కోట్ల మంది ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభ పరిణామం అన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు. వంద ఏళ్లు దాటిన వారు 1,174 మంది ఉన్నారు. జనవరి 22న తుది జాబితా విడుదల చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news