ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించగా…. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు అధికారులు.
రాయలసీమ పరిసర ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బుధవారం ఉదయం వరకు తిరుపతి జిల్లా తడలో 88.2 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు…. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.