ఏపీ లో ఒక్కరోజే 60 కోట్లు మద్యం తాగేసారు…!

-

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు మొదలు కావడంతో ఇన్నాళ్ళు నాలుక పీకేస్తున్న జనం అందరూ కూడా మద్యం షాపుల వద్ద బారులు తీరారు. వేలాది మంది వచ్చి మద్యం కొనుగోలు చేసారు. సామాజిక దూరం పాటించకుండా జనాలు మద్యం కోసం ఎగబడ్డారు. కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టి షాపులు ఓపెన్ చేస్తే.. మరికొన్ని చోట్ల బాణాసంచాల పేల్చి సంబరాలు చేసుకున్నారు జనాలు.

ఆడాళ్ళు మగాళ్ళు అందరూ కూడా మద్యం కోసం బారులు తీరారు. మద్యం ధరలు పెరిగినా సరే మద్యానికి అలవాటు పడిన వాళ్ళు అందరూ కూడా ఎగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 మద్యం షాపులు ఉండగా.. 2,345 వైన్స్‌ షాపులను మాత్రమే రీఓపెన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయి అనేది చూస్తే. రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతూ ఉండేవి సాధారణ రోజుల్లో.

ఇప్పుడు లాక్ డౌన్ ఉంది కాబట్టి రెడ్ జోన్ లో మద్యం అమ్మకాలు లేవు. అయినా సరే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని సమాచారం. అంటే ఏ స్థాయిలో జనాలు మద్యం కొనుగోలు చేసారో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ధిక కష్టాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు దొరికింది. డబ్బులు లేకపోయినా సరే మద్యం కోసం పోటీ పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news