మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో దూకుడు పెంచింది ఏపీ సీఐడీ. మార్గదర్శి చందాదారుల రక్షణ కోసం ప్రత్యేక జీవో జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ. వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే 7 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది ఏపీ సీఐడీ. రూ. 793 కోట్లు విలువైన మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ… మార్గదర్శి కేసులో A1 రామోజీ, A2 శైలజా కిరణ్ భారీగా నగదు, బ్యాంక్ ఖాతాల్లో నిధులు ఉన్నట్లు గుర్తించింది.
మ్యూచువల్ ఫండ్‌లో డిపాజిట్లు అటాచ్ చేసింది సీఐడీ. మార్గదర్శి చిట్స్ ఖాతాదారుల భద్రత కోసం ఆస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీమ్‌ల నిర్వహణ జరుగగా.. సబ్ స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడం వంటి అక్రమాలు గుర్తించారు అధికారులు. వడ్డీలిస్తామని చట్ట విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి, అక్రమంగా నిధులు మళ్లించినట్టు సీఐడీ గుర్తించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ మార్గదర్శి.. మార్గదర్శిలో మనీల్యాండరింగ్ కార్యకలాపాలపై చర్యలకు
ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది సీఐడీ.