బ్రేకింగ్: పోలవరం ప్రాజెక్ట్ లో కీలక అడుగు…!

-

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనుల విషయంలో ఇప్పుడు మళ్ళీ దూకుడు పెరిగింది. ఏపీ సర్కార్ పోలవరం పనుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టు గ్యాప్-1 డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులకు పూజా కార్యక్రమం నిర్వహించిన ఇరిగేషన్ అధికారులు… నేటి నుంచి మొదలు పెట్టనున్నారు. మొత్తం 450 మీటర్లు గ్యాప్ 1 డయా ఫ్రం వాల్ పొడవు ఉంటుంది.

ప్రధాన డ్యాం నిర్మాణంలో కీలకం కానుంది ఈ ప్రాజెక్ట్. ఇది ప్లాస్టిక్ కాంక్రీట్ డయా ఫ్రం వాల్ అని అధికారులు చెప్పారు. దీనిలో మొత్తం 89 ప్యానల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సిఈ ఎమ్. సుధాకర్ బాబు, ఎస్ ఈ ఎమ్.నాగిరెడ్డి పాల్గొన్నారు. మేఘా సంస్థ జిఎం అంగర సతీష్ బాబు, ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతి, మేనేజర్ మురళి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news