ఇండియాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనాలో పుట్టిన బీఎఫ్ 7 కరోనా వేరియంట్ తాకిడి ఇండియాకు చుట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో సైతం కరోనా కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం కలవరపెడుతోంది.
కోవిడ్ కు సంబంధించిన ఫేక్ వార్త లు ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ వేదికగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీం ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. ఆ వీడియో 2021 ఏప్రిల్ నెలకు సంబంధించినదని పేర్కొంది. ఆ వీడియో ప్రస్తుతం పలు వాట్సాప్ గ్రూపులు, ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతూ ప్రజల్లో మరింత భయాందోళనను సృష్టిస్తోందని వివరించింది. ఏపీలో ఎలాంటి లాక్ డౌన్ ఉండబోదని తేల్చి చెప్పింది.
Please do verify such info before forwarding.
Original link: https://t.co/nGPSXA3SvT
Video in circulation: 👇 pic.twitter.com/NneRsHCkat
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) December 29, 2022