ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. న్ జనసేన పలువురు కీలక నేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో కృష్ణ జిల్లా పెడనా జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైయస్సార్సీపీలో చేరారు రామ్ సుధీర్ తో పాటు జనసేన స్థానిక నాయకులు ఎడ్లపల్లి లోకేష్ పోలగాని లక్ష్మీనారాయణ మద్దాల పవను తోట జగదీష్ తదితరులు చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు ప్రతిపక్ష నాయకులు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఏపీ అభివృద్ధిలో ముందుందని తెలిపారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.