ఓటమి ఖాయం కావడంతోనే ఈ దాడులు : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరిగినప్పటి నుంచి టీడీపీ-వైసీపీ నేతల మధ్య నిత్యం వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు కావడంతో ఎవ్వరో ఒకరు వాటిని రెచ్చగొడుతున్నారు. తాజాగా ఇంట్లో నిద్రిస్తున్న శేషాద్రి అనే యువకుడిని కొంత మంది దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు.

ఈ ఘటన పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. వైసీపీ ఓటమి ఖాయం కావడంతోనే ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు.  ఇంట్లో నిద్రిస్తున్న శేషాద్రిని ఉదయం కొంత మంది దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓటమి ఖాయం కావడంతో వైసీపీ గుండాలు విచక్షణ కోల్పోయి.. ఇలా దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news