జడ్జి భార్యను అంటూ నిలువునా ముంచింది…!

ఏపీలో ఒక చీరల షాప్ యజమానికి ఒక మహిళ షాక్ ఇచ్చింది. తాను బెంగళూరులో ఒక న్యాయమూర్తి భార్యగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో షాపు కీపర్‌ ను ఆమె మోసం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను బెంగళూరులో అరెస్ట్ చేసారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. ఆమె బెంగళూరులోని ఇందిరానగర్ లోని సుగునా కంఫర్ట్స్ లో నివాసం ఉండే హెచ్ శశికళగా చెప్పారు.

ఆమె వయసు 45 ఏళ్ళు కాగా… ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని పటూరు గ్రామంలోని పెడం టెక్స్‌టైల్స్‌ దుకాణానికి వెళ్ళిన ఆమె… పట్టు చీరలు కావాలని, తాను న్యాయమూర్తి భార్యను అని చెప్పింది. ఆ చీరలను యునిషైర్ పనామెరా అపార్ట్‌మెంట్స్‌కు తీసుకురావాలని ఆమె అడగడంతో… వారు తీసుకుని వెళ్ళారు. , డెలివరీ తీసుకున్న తరువాత శశికళ తన భర్తకు చీరలు చూపిస్తానని తానే షాప్ కి వస్తా అని చెప్పింది. ఆమె వస్తుంది అని ఎదురు చూసిన షాప్ ఓనర్ చివరికి రాకపోవడంతో పోలీసులకు చెప్పాడు. ఆమె నుండి 3 లక్షల రూపాయల విలువైన 120 కి పైగా పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు.