ఏపీ డిగ్రీ కాలేజీలకు అకడెమిక్ క్యాలెండర్ విడుదల..

-

వచ్చే నెల రెండో తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతుల నిర్వహాణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు యూనినర్శిటీలు, కళాశాలల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తల మీద నిన్న పొద్దుపోయాక గైడ్ లైన్స్ జారీ చేసింది. అలానే యూనివర్శీటలకు.. కాలేజీలకు అకడెమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.

ఏ రోజైనా పని దినాల్లో శెలవు ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా శెలవు దినాలు, రెండో శనివారాలు, ఆదివారాల్లో క్లాసులు నిర్వహించాలని సూచించింది. క్లాస్ రూమ్స్, క్యాంటీన్లు, జిమ్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాకని ఆదేశించింది. హాస్టళ్లల్లోనూ కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. హాస్టళ్లను ఒకటో వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని సర్కార్ ఆదేశించింది. అలానే కామన్ హాల్స్.. టీవీ హాల్సును వసతి కోసం కూడా వివియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news