అచ్చెన్న అభిమానుల అలక… తెగిపోనుందా బాబు పిలక?

-

ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన అచ్చెన్నాయుడు విషయంలో బాబు వైఖరి మారిపోయిందని అచ్చెన్న అభిమానులు తెగ ఫీలవుతున్నారంట. అచ్చెన్న అరెస్టయిన కొత్తలో తెగ హడావిడి చేసిన చంద్రబాబు – చినబాబులు… రోజులు గడిచేకొద్దీ.. వారికి మరో తాడు తోడు దొరికేసరికి అచ్చెన్నను లైట్ తీసుకుంటునారనేది వారిపై అభియోగం!

అవును.. అచ్చెన్నాయుడు అరెస్టయిన కొత్తలో బాబు ఫుల్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించారు. తమ్ముళ్లను బలంగా ఉత్సాహపరిచారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాధంలో మృతుల కుటుంబాలను లైట్ తీసుకున్న బాబు… గుంటూరు జీజీహెచ్ కి వెళ్లి అచ్చెన్నాను పరామర్శించాలని ప్రయత్నించారు. చినబాబు అయితే… “విశాఖ మీదుగా శ్రీకాకుళం” వెళ్లి మరీ అచ్చెన్నా కుటుంబాన్ని ఓదార్చారు. ఉత్తరాంధ్ర రుచులు చూసొచ్చారు! అయితే… అది గతం… ఇదే అచ్చెన్న అభిమానుల ఆవేదన!

అచ్చెన్నా అరెస్టు అనంతరం ట్విట్టర్ లో బాబు ఫోటో కూడా… అచ్చెన్నదే ఉండేది! కవర్ ఫోటో మొత్తం “అక్రమ అరెస్టులు” అంటూ అచ్చెన్నకు సానుభూతి తెలియజేస్తూ హైలట్ గా నిలిచేది. కాలం గడిచేకొద్దీ.. అచ్చెన్నకు బెయిల్ తిరస్కరణకు గురైననాటి నుంచీ.. ఇక ఆయన అవసరం పార్టీకి ఉండకపోవచ్చని భావించారో ఏమో కానీ… బాబు ట్విట్టర్ కవర్ ఫోటో మారిపోయింది. అచ్చెన్నను పక్కనపాడేసిన బాబు… “ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని” అంటూ తన ప్రియారిటీ మార్చేశారు!

దీంతో… “బాబుకు ప్రత్యేకంగా అచ్చెన్నపై ప్రేమేమీ లేదు… తన రాజకీయ అవసరాలకోసం అచ్చెన్నా అరెస్టును వాడుకున్నారు.. ప్రేమ ఉన్నట్లు నటించారు..” అనేది అచ్చెన్న అభిమానుల ఆవేదనగా ఉంది! అచ్చెన్నా అరెస్టు కంటే ఎక్కువగా పొలిటికల్ మైలేజీ ఇచ్చే అంశంగా నేడు “అమరావతి” ఇష్యూ తెరపైకి రావడంతో.. అది కాస్తా బాబు “ట్విట్టర్ పైకి” చేరిందని వాపోతున్నారు. అంటే… ఇక అచ్చెన్న విషయంలో బాబు నుంచి ఎలాంటి స్పందనా ఆశించొద్దనేది పరోక్ష సంకేతం అని.. ఇది దారుణం అని.. “అచ్చెన్నకు కూడా వెన్నుపోటు పొడుస్తారా” అంటూ వీరంగం ఆడుతున్నారు.. అచ్చెన్న వీరాభిమానులు!

మరి ఈ విషయాలపై అభిమానుల ఆగ్రహానికి, ఆవేశానికి అచ్చెన్న కూడా మద్దతు ప్రకటిస్తే… వైకాపా నేతలు చెబుతున్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి – అక్రమాల విషయాలు అన్నీ ప్రభుత్వానికి చెప్పేస్తే… విజయసాయిరెడ్డి మాటల్లో చెప్పాలంటే “అచ్చెన్న అప్రూవర్” గా మారిపోతే… “ఊడిపోదా బాబు పిలక” అనేది ఆయన వీరాభిమానుల మాటగా ఉంది! చూడాలి మరి ఏమి జరుగుతుందో!!

Read more RELATED
Recommended to you

Latest news