Nani : జనసేనకు నేచురల్ స్టార్ నాని మద్దతు

-

ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి పోటీలోకి దిగిన జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఈ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్, అల్లు ఫ్యామిలీల నుంచి పలువురు కుటుంబ సభ్యులు నేరుగా రాజకీయ క్షేత్రంలోకి దిగి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మరికొందరు నటులు కూడా ప్రచారం నిర్వహిస్తూ పవన్కు సపోర్ట్ ఇస్తున్నారు.

ఇక తాజాగా ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని కూడా చేరిపోయారు. జనసేన పార్టీకి తన మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ప్రకటించారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. ‘పవన్‌ కల్యాణ్‌.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయి. నా మద్దతు మీకే. ఆల్ ది బెస్ట్‌ సర్‌’ అంటూ నాని పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news