BRS ప్రభుత్వ సీక్రెట్ రివీల్ చేసిన ఈటల..!

-

కేసీఆర్ హయాంలో వ్యవస్థ గాడి తప్పడానికి చాలా కాలం పట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే గాడి తప్పిందని బీజేపీ నేత, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్  పేర్కొన్నారు.  మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు ఈటల. కాంగ్రెస్ పరిస్థితి ప్రజలకు అర్థమైపోయిందని, రాష్ట్రంలో 7-10 శాతం కమీషన్లు ఇస్తే తప్ప పనులు కాని పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల పేరిట ఓట్లు సంపాదించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ ను ఓడించిందన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.

మల్కాజిగిరిలో ఈటలను ఓడించేందుకు రేవంత్ రెడ్డి పోలీసులను, ఇంటలిజెన్స్ అందరినీ దించారని కానీ వీరందరిని పెట్టుకున్న కేసీఆర్ మొన్న అధికారం కోల్పోలేదా అని అన్నారు. ప్రజలు అంతిమ నిర్ణయం తీసుకుంటారన్నారు. రెడ్లు అందరూ కాంగ్రెస్ కే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇది రేవంత్ రెడ్డి దిగజారుడు తనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. కులాలు, మతాల ప్రాతిపదికన ఎవరూ గెలవరన్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news