కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే 9,10 ఇంటర్ విద్యార్దులకు పాక్షికంగా తరగతులు నిర్వహిస్తున్నామన్న ఆయన అక్టోబర్ 5వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే పాఠశాలల పునః ప్రారంభంపై నడుచుకుంటామని అన్నారు.
ఉన్నత విద్యా తరగతులు మాత్రం నవంబర్ ఫస్ట్ నుండి ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన స్కూల్ తరగతులకి మేము ప్రారంభించామనేది కాకుండా విద్యార్ధులు వారి తల్లిదండ్రుల అనుమతి మేరకు స్కూళ్లకు రావాలని అన్నారు. 50 శాతం మంది ఉపాద్యాయులనే హాజరు కావాలని చెప్పామన్న ఆయన అకడమిక్ క్యాలెండర్ విడుదల అనంతరం పూర్తి స్తాయిలో ఉపాద్యాయుల సేవలను అమలులోకి తెస్తామని అన్నారు. లెక్చరర్స్ జీతాల విషయం మీద ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాలు సూచనల మేరకు నడుచుకుంటామని అన్నారు.