జనసేనలోకి ఆదినారాయణ రెడ్డి…?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీలోకి కొంత మంది భారతీయ జనతా పార్టీ నేతలు వచ్చే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. కొంతమంది కీలక నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యలు వినిపించినా అలా కాదు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీలో నుంచి బయటకు రావడానికి కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి జనసేన పార్టీలోకి వెళితే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆదినారాయణరెడ్డి ప్రభావం ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం లో ఎక్కువగా ఉంది ఆయనకు సొంత వర్గం ఎక్కువగా ఉండటమే కాకుండా ఆయనకు ప్రజల్లో కూడా అక్కడ చాలామంచి ఆదరణ ఉంది. అందుకే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి విషయంలో జనసేన కూడా ఆసక్తికరంగా ఉన్నట్టుగా సమాచారం. మరి ఆదినారాయణరెడ్డి పవన్ కళ్యాణ్ తో ఎంతవరకు కలిసి పని చేస్తారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.

TOP STORIES

సంస్కృతం నేర్చుకోవాల‌నుకునే వారి కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త యాప్‌..!

సంస్కృతం భాష‌ను దైవ భాష అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ భాష నుంచే అనేక భార‌తీయ భాష‌లు వ‌చ్చాయ‌ని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్ర‌స్తుత...