చెన్నైలో ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సీన్ రిపీట్‌….శవాలను పడేసి !

-

చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సీన్ రిపీట్‌ అయింది. రైల్వే స్టేషన్ లో శవాన్ని సూట్ కేసులో విసిరారు. నెల్లూరులో మహిళను హత్య చేసి… చెన్నై సమీపంలోని మీంజూర్ రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్‌లో ప్యాక్‌ చేసి… మహిళా శవం పడేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన తండ్రీ కూతురు….ఈ పని చేశారట. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. మీంజూర్ స్టేషన్‌కు వద్ద సూట్ కేసు ను ప్లాట్‌ఫాంపై విసిరేశారు తండ్రి సుబ్రహ్మణ్యం, కూతురు‌‌దివ్య శ్రీ.

Agent Sai Srinivasa Atreya movie scene repeat in Chennai

సూట్ కేస్ విసిరిన సమయంలో ఆర్ ఏఫ్ పిఎఫ్ కానిస్టేబుల్ మహేష్‌‌ గుర్తించారు. ‌సూట్‌కేస్ లో నుంచి రక్తం రావడంతో.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసారు. హత్యకు గురైంది 65 ఎళ్ళు వృద్దురాలు మ‌ణ్యం రమణి గా గుర్తించారు పోలీసులు. తన కూతురిని వ్యభిచారంలోకి దించాలని రమణి పలుమార్లు ప్రయత్నించడంతో చంపామని పోలీసుల విచారణలో తెలిపారట తండ్రి సుబ్రహ్మణ్యం. నిన్న ఉదయం ఇంటికి వచ్చి దివ్య శ్రీ తనతో పంపిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని రమణి చెప్పిందని‌.. అ సమయంలో జరిగినా గోడవతోనే అమె హత్య చేసినట్లు చెప్పారట తండ్రి సుబ్రమణ్యం. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news