Online tickets : జగన్ సర్కార్ తో అల్లు అరవింద్ కీలక ఒప్పందం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయం “జస్ట్ టికెట్స్ ” కు దక్కే అవకాశం కనిపిస్తోంది. అంటే… ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ నిర్వహించిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు ఫైనల్ అయితే… అదే నిజం కానుంది అనే వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ పోరాటాల ద్వారానే రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయం చేపట్టాలని వైసీపీ సర్కార్ నిర్ణయం అమలులోకి వస్తే ప్రేక్షకులు ఎఫ్ డి సి పోర్టల్ ద్వారా ఆన్ లైన్ టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఏపీలో థియేటర్ల యజమానులు లేదా ఆన్లైన్ యాప్ ల ద్వారానే సినిమాలా టిక్కెట్లు విక్రయిస్తారు. అయితే ఆన్లైన్, యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రేక్షకుడు 20 రూపాయల దాకా కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ మద్యం తరహాలో సినిమా టికెట్లు ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.

ఏపీ డీఎస్సీ ద్వారా ఆన్లైన్ విక్రయాలకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. పలు సంస్థలు టెండర్లు వేసిన రెండు సంస్థలు మాత్రమే తక్కువకు కోట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో చెన్నైకి చెందిన జస్ట్ టికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ 1 అని సమాచారం. ఈ సంస్థలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేశు డైరెక్టర్గా ఉన్నారు. దాదాపు వీరికే ఈ ఆన్లైన్ వ్యవహారాన్ని ప్రభుత్వం అప్పజెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news