ఎవరు అవునన్నా కాదన్నా జగన్ అనుకుంటున్నట్లుగా ఏపీకి మూడురాజధానులు ఫిక్స్ అనేది అంతా చెబుతున్న మాట! ఈ క్రమంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమారావతికి అత్యంత గౌరవం ఇచ్చిన జగన్.. అనంతరం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. ఈ క్రమంలో రాను రానూ వాస్తవాలు తెలుసుకుంటున్న అమరావతి ప్రేమికులు… పోనీలే అదైనా ఉంది.. లేదంటే ఈ తాత్కాలిక భవనాలను తొలగించి.. మొత్తం విశాఖకు పట్టుకెళ్లిపోయేవారు! అని సంతోషపడుతున్న సమయమిది!!
ఈ సమయంలో టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రజాప్రయోజనాల ప్రాతిపదికగా పరిశీలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. “ఒకే రాజధాని నగరం” ప్రకారం అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరారు! ఇది పూర్తిగా గవర్నర్ విచక్షణాధికారానికి సంబందించిన విషయం అనే కథనాలు వస్తున్న నేపథ్యంలో… రాజధాని అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని కేంద్రంలోని పెద్దలు చెబుతున్న పరిస్థితుల్లో… నిజంగా రామకృష్ణుడు కోరుకుంటున్నట్లు జగన్ అదే ఫిక్సయ్యి… మొత్తం విశాఖలో పెడితే!
ఇప్పుడు అమరావతి అభిమానులను కలిచి వేస్తున్న అనుమానం ఇది! యనమల అత్యుత్సాహం వల్ల.. గవర్నర్ కే సూచనలు ఇవ్వడంవల్ల.. ఉన్నది కూడా ఊడిపోతుందా అనే భయాన్ని వ్యక్తపరుస్తున్నారంట అమారావతి ప్రేమికులు! మరీ యనమల రాసిన లేఖపై గవర్నర్ పునఃపరిశీలిస్తారా లేక ప్రభుత్వం చెబుతున్న విశాఖకే “ఒకే” అంటారా లేక ఒకే రాజధాని అని మొత్తం విశాఖకు వెళ్లమంటారా? కొత్త టెన్షన్స్ పెట్టావు యనమలా… అంటున్నారు అమరావతి ప్రేమికులు!!