చంద్రబాబు కమీషన్ లకు కక్కుర్తి పడ్డారు : అంబటి రాంబాబు

-

చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం విషయం లో చంద్రబాబు కామీషన్ లకు కక్కుర్తి పడ్డారు. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారు. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాజెక్ట్ లో అన్ని కట్టడాలు ఒక్కసారే కట్టడం వల్లే ప్రాజెక్ట్ ప్రమాదం లో పడింది. ఇది నిపుణులు చెప్పిన మాట. నది డైవర్షన్ పూర్తి కాకుండా, డయాఫ్రమ్ వాల్, కాఫర్ డాం లు వేయ కూడదు. అలాంటి తప్పే గత టీడీపీ ప్రభుత్వం చేసింది అని అన్నారు అంబటి రాంబాబు.

చంద్రబాబు తొందర పాటు తో పోలవరాన్ని ఆరేళ్ళు వెనక్కు నెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వచ్చిన వరదలు పోలవరం నిర్మాణంను దెబ్బతీశాయి. ప్రతి సోమవారం పోలవరం వెళ్లి చంద్రబాబు చేసింది ఏంటి… పోలవరాన్ని పాడు చేయడం తప్ప అని పేర్కొన్నారు. చేసిందంతా, చేసి చంద్రబాబు ఇప్పుడు మీడియా ముందు ఆవేశపడుతున్నాడు. 2019 లో YCP ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వేగం పెరిగింది. 2016 లో కమీషన్ ల కోసం కక్కుర్తి పడీ పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు అని మాజీ మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news