తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంత నష్టపరిహారం కల్పించారు : అంబటి రాంబాబు

-

తుఫాన్ పై ప్రభుత్వం ముందస్తు చర్చతో తీవ్ర నష్టం తప్పిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు అంబటి..  సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రతి సంక్షోభాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. రైతుల బాధను పట్టని అసమర్థత సీఎం అని తప్పుడు వార్తలు రాస్తున్నారని రామోజీరావుపై మండి పడ్డారు అంబటి రాంబాబు. నారా చంద్రబాబు నాయుడు రైతులకు నష్టపరిహారం ఇచ్చిన దాని కంటే ఎక్కువగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందజేశామని తెలిపారు. 

జగన్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుంది. రైతు బాధలు పట్టించుకోని అసమర్థత సీఎం జగన్ మోహన్ అంట.. రైతు బాధలు పట్టించుకుంటాడట చంద్రబాబు.. రైతులు అవసరం లేదని.. ఐటీనే బెటర్ అని చెప్పిన చంద్రబాబు ఇవాళ రైతుల గురించి మాట్లాడటం హ్యాస్యస్పదంగా ఉందన్నారు. కొత్తవి కట్టరు.. ఉన్న ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని ఇష్టం వచ్చినట్టు రాశారు. అసలు రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టింది.. ఎవరు అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. దాదాపు కాంగ్రెస్ ప్రాజెక్టులన్నింటిని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మంజూరయ్యాయని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరైన ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగన్ సంకల్పంతో ముందుకెళ్తున్నారని తెలిపారు అంబటి రాంబాబు. తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంత నష్టపరిహారం కల్పించారని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news