అంజూ యాదవ్‌పై పవన్ ఫిర్యాదు.. అంబటి సెటైర్లు

-

సిఐ అంజు యాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ముద్రగడ సతీమణి అప్పటి పోలీసులు హింసిస్తే నోరు మూసుకున్న పెద్దమనిషి… అంజూ యాదవ్ పై కంప్లైంట్ ఇవ్వడానికి తిరుపతి వెళ్ళాడు… వారెవ్వా!’ అని ట్విట్ చేశారు.

కాగా, శ్రీకాళహస్తిలో సీఎంకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉండగా …అది కూడా రావణుడి మాదిరిగా పది తలలతో కూడిన దిష్టిబొమ్మను తగులబెడుతూ తలమీద కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు.ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఇక వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news