కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులను ఐదు కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు అండగా నిలవాలని ఆయన కుటుంబం ముందుకు వచ్చి కొద్ది రోజుల క్రితమే.. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ రూ.పది లక్షలు, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రూ.పది లక్షలు, వైష్ణవ్ తేజ్, నిహారిక చెరో ఐదు లక్షల రూపాయల చొప్పున విరాళంగా అందజేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి రైతు భరోసా యాత్ర కోసం విరాళం అందించారు. పవన్ తండ్రి కొణిదల వెంకట్రావు జయంతి సందర్భంగా అంజనాదేవి తన పెన్షన్ డబ్బుల నుంచి కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ. లక్షన్నర అందజేశారు. దీంతో పాటు జనసేన పార్టీకి మరో మరో రూ. లక్ష విరాళం ఇచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలిసి చెక్కులు అందజేశారు.
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి అంజనా దేవి గారు ఈ రోజు జనసేన కౌలు రైతు సంక్షేమ నిధికి లక్ష యాభై వేల రూపాయల విరాళం మరియు జనసేన పార్టీకి లక్ష రూపాయల విరాళం అందించారు. pic.twitter.com/975m9k3jww
— JanaSena Party (@JanaSenaParty) June 25, 2022