ఆంధ్రప్రదేశ్ : రాబడి రూ.9,317 కోట్లు… అప్పు రూ.13,430 కోట్లు

-

ఏపీలో అప్పులు ఎక్కువైపోయాయని ఇప్పటికే విమర్శలు తీవ్రమయ్యాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు అదే ఒరవడి కొనసాగుతోందని తాజా లెక్కలు స్పష్టీకరిస్తున్నాయి. రాష్ట్రాల లెక్కలను కాగ్‌ పరిశీలించి ఎప్పటికప్పుడు తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. సాధారణంగా ఏప్రిల్‌ లెక్కలు మే నెలాఖరునాటికి వెబ్‌సైట్‌లో ఉండాలి.

దేశంలోని అన్ని రాష్ట్రాల ఏప్రిల్‌ లెక్కలే కాదు.. మే నెల లెక్కలూ తేలిపోయాయి. కొన్ని రాష్ట్రాల జూన్‌ లెక్కలూ వెలుగుచూశాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏప్రిల్‌ లెక్కలను కాగ్‌ వెల్లడించేందుకు ఏకంగా 3నెలల సమయం తీసుకుంది. ఇది కూడా తాజా పరిస్థితుల్లో చర్చనీయాంశమవుతోంది.

రెవెన్యూ లోటు మొదటి నెలలోనే మూడొంతులు.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు ఉంటుందని బడ్జెట్‌ గణాంకాల్లో పేర్కొన్నారు. అలాంటిది తొలి నెలలోనే ఏకంగా రూ.13,013.40 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఏడాది మొత్తంగా రెవెన్యూ లోటు అంచనా వేసిన దాంట్లో ఏకంగా 76శాతం తొలి నెలలోనే ఏర్పడటం గమనార్హం. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చు ఎంత ఎక్కువ ఉందో చెప్పడంతోపాటు ఈ ఖర్చు వల్ల తిరిగి ఎలాంటి ఆదాయం సాధించలేనిది అని కూడా అర్థమవుతుంది.

రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడిలో వివిధ పన్నుల రూపంలో రూ.7,730.75 కోట్లు వచ్చింది. అందులో జీఎస్టీ రూ.3,081 కోట్లు. కేంద్రం గ్రాంట్ల రూపంలో వచ్చింది రూ.1,279.32 కోట్లు. అమ్మకం పన్ను రూ.1,431 89 కోట్లు. వచ్చిన రాబడిలో వడ్డీ చెల్లించేందుకు రూ.2,041 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news